‘లియో’ సినిమాపై భారీ అంచనాలు.! అందుకేనా.!
- October 05, 2023
ఇళయ దళపతి విజయ్ హీరోగా వస్తున్న చిత్రం ‘లియో’. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందీ భారీ చిత్రం. భారీ చిత్రం అని ఎందుకనాల్సి వచ్చిందంటే, ఈ సినిమా దర్శకుడు అలాంటోడు మరి. ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలను తెరకెక్కించి విపరీతమైన బజ్ క్రియేట్ చేసుకున్నాడీ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.
ఆయన నుంచి వస్తున్న చిత్రం కావడంతో ‘లియో’పై భారీ అంచనాలున్నాయ్. విజయ్‌కి జోడీగా ఈ సినిమాలో త్రిష నటిస్తోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి త్రిష లుక్ రిలీజ్ చేసి అభిమానులకు నయా ఫీస్ట్ ఇచ్చింది ‘లియో’ టీమ్.
కాగా, సినిమా ట్రైలర్‌నీ మరి కొద్ది గంటల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని ఓ రేంజ్‌లో నిలబెట్టేశాయ్. ఇక, రాబోయే ట్రైలర్‌పై విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ట్రైలర్‌ని బట్టి ‘లియో’పై ఓ అంచనాకి వచ్చేస్తారు ఆడియన్స్. అయితే, ఇంత ఆసక్తికి కారణాలు లేకపోలేదు. ‘ఖైదీ’ నుంచి ‘విక్రమ్’కి ఓ లీడ్ కనెక్ట్ చేసి, అటు ‘ఖైదీ’, ఇటు ‘విక్రమ్’ సినిమాల సీక్వెల్స్‌పై క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు లోకేష్ కనగరాజ్.
అలాగే, ‘లియో’కి కూడా ఏమైనా అలాంటి ఫ్లాష్ బ్యాక్ లింకులు కనెక్ట్ చేసి వుంటాడా.? అని భావిస్త్తున్నారు ఆడియన్స్. అంతే కాదు, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండడం సినిమాపై ఆసక్తి పెరగడానికి మరో కారణం. ఇప్పటికే విజయ్, సంజయ్ దత్ కాంబినేషన్ సీన్లకు సంబంధించిన పవర్ ఫుల్ పోస్టర్లకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







