నిద్రలేమి బాధిస్తుంద...
- May 21, 2016
ఆహారపుటలవాట్లూ.. జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిని నిద్రలేమి బాధిస్తుంది. అలాంటి వారు ఈ పానీయాలను తాగడం అలవాటు చేసుకుంటే ఒత్తిడి తగ్గి.. హాయిగా నిద్రపడుతుంది.
కొబ్బరి నీళ్లు: పొటాషియం, మెగ్నీషియం నీళ్లలో ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ కండరాలను ఉత్తేజితం చేస్తాయి. అలానే కొబ్బరి నీళ్లలోని విటమిన్ బి ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. పడుకోవడానికి ఓ రెండు గంటల ముందు నీళ్లను తాగడం మంచిది.
గ్రీన్ టీ: అమినో ఆమ్లాలు సమృద్ధిగా లభించే గ్రీన్ టీ హాయి నిద్రకు కారణమవుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తగ్గించి.. ఒత్తిడినీ దూరం చేస్తాయి. త్వరగా నిద్రపట్టేందుకు గ్రీన్‌టీలోని పోషకాలు దోహదం చేస్తాయి.
లెమన్ టీ: గ్లాసు వేణ్నీళ్లలో నిమ్మరసం, అల్లం ముక్కలు, తేనె వేసి బాగా మరిగించాలి. నీళ్లు గోరువెచ్చగా అయ్యాక వడకట్టి తాగితే చక్కగా నిద్రపడుతుంది.
సబ్జా గింజలు: వేసవి తాపాన్ని తీర్చే సబ్జాగింజలు.. ఒత్తిడిని దూరంగా చేసి నిద్రపట్టడానికి దోహదం చేస్తాయి. ఈ గింజల్ని ఉడికించి రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టాలి. మరుసటి రోజు రాత్రి నిద్రపోవడానికి ముందు నీళ్లలో కలుపుకుని తాగితే మంచిది.
పాలు: గోరువెచ్చని పాలలో తేనె, బాదం పొడి, వేసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. తేనె బాదం వల్ల శరీరానికి అమినో ఆమ్లాలు అందుతాయి. అవి ఒత్తిడినీ, చిరాకులను తగ్గించి నిద్రపట్టేలా చేస్తాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







