కీలక రహదారిపై ప్రమాదం.. పొగమంచు కారణంగా వేగ పరిమితి తగ్గింపు

- October 06, 2023 , by Maagulf
కీలక రహదారిపై ప్రమాదం.. పొగమంచు కారణంగా వేగ పరిమితి తగ్గింపు

యూఏఈ:ఎమిరేట్‌లోని కీలక రహదారిపై అబుదాబి అథారిటీ వాహనదారులను హెచ్చరించింది. అబుదాబి యూనివర్శిటీకి ఎదురుగా ఉన్న అల్ ఐన్ రోడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి డ్రైవర్‌లకు తెలియజేయడానికి అబుదాబి పోలీసులు గతంలో ట్విటర్‌లో (X) ఒ పోస్ట్ ని చేశారు. సంబంధిత రహదారిపై రద్దీ, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందుగా ప్రకటించిన హెచ్చరికలో పొగమంచు కారణంగా అబుదాబిలోని ఒక ప్రధాన రహదారిపై వేగ పరిమితి తగ్గించినట్లు పేర్కొన్నారు.  ఇది షేక్ మహమ్మద్ బిన్ రషీద్ రోడ్డులో గంటకు 80 కి.మీ.కి తగ్గించారు. పొగమంచు కారణంగా తక్కువ లో విజిబిలిటి కారణంగా డ్రైవర్లు జాగ్రత్త వహించాలని అధికార యంత్రాంగం కోరింది.  వాహనదారులు సిగ్నల్స్, ఎలక్ట్రానిక్ డైరెక్షనల్ బోర్డులను గమినించాలని పిలుపునిచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com