బాలీవుడ్‌ని బెంబేలేత్తిస్తున్న మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్..
- October 06, 2023
ముంబై: బాలీవుడ్ ఎప్పడూ ఏదో ఒక సంచలనమైన సంఘటనలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా బాలీవుడ్ లో ఈడీ నోటీసులు వైరల్ గా మారింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసులో పలువురు బాలీవుడ్ నటులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపిస్తుంది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ అనేది ఒక గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్. గతంలో ఈ యాప్ కి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు భారీగా డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ చేశారు. ఈ యాప్ అధినేతల్లో ఒకరైన సౌరభ్ చంద్రకర్ ఇటీవల తన వివాహాన్ని దుబాయ్ లో 200 కోట్లతో ఘనంగా చేసుకున్నాడు. ఈ వివాహానికి టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహా కక్కర్, భారతి సింగ్, కృతి కర్బందా, నుశ్రుత్.. ఇలా అనేకమంది బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు.
ఈ సంఘటన తర్వాత మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముసుగులో మనీలాండరింగ్ కూడా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దీనిపై ద్రుష్టి సారించి విచారణ జరుపుతుంది. ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ తో సంబంధం ఉన్నవాళ్ళకి, దీనికోసం ప్రమోట్ చేసిన వాళ్ళకి ఈడీ నోటీసులు పంపుతుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కి విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.
తాజాగా నేడు బాలీవుడ్ నటులు కపిల్ శర్మ, హ్యూమా ఖురేషి, హీనా ఖాన్.. లతో పాటు మరికొంతమంది మహాదేవ్ బెట్టింగ్ యాప్ తో సంబంధం ఉన్న వాళ్లకి ఈడీ నోటీసులు పంపింది. దీంతో బాలీవుడ్ లో ఈ ఘటన సంచలనంగా మారింది. మరింతమంది బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఈ స్కామ్ లో నోటీసులు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. దీంతో బాలీవుడ్ లో ఇప్పుడు మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







