హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..

- October 06, 2023 , by Maagulf
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్: హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న సౌమ్య ఫర్నీచర్ లో ఈ ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని గుర్తించారు. మూడు అంతస్తులలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మిగతా మూడు దుకాణలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కూకట్ పల్లి మెట్రో స్టేషన్ సమీపంలోనే ఈ ఫర్నీచర్ షాప్ ఉంటుంది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో రోడ్డు మీద వెళ్లే జనం, ఫర్నీచర్ షాప్ కి చుట్టుపక్కల ఉన్న షాపుల వాళ్లు, స్థానికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అగ్నిప్రమాదం సంభవించిన ఫర్నీచర్ షాప్ పక్కనే క్లాత్ షాప్, రెస్టారెంట్ ఉన్నాయి. మంటలు మరింత వ్యాపించకుండా అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు.

సుమారు అరగంట పాటు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతం అంతా భయానకమైన వాతావరణం చోటు చేసుకుంది. ఫర్నీచర్ షాప్ లోని మూడు ఫోర్లలో ఉంచిన ఫర్నీచర్ కు సంబంధించిన ఐటెమ్స్ పూర్తిగా కాలిబూడదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com