బిజెపిలో చేరిన చికోటి ప్రవీణ్

- October 07, 2023 , by Maagulf
బిజెపిలో చేరిన చికోటి ప్రవీణ్

హైదరాబాద్‌: కాసినో వ్యవహారాలు, ఫామ్ హౌస్ లో చిత్రవిచిత్రమైన జంతువుల పెంపకం తదితర అంశాలతో గుర్తింపు తెచ్చుకున్న చికోటి ప్రవీణ్ నేడు బిజెపిలో చేరారు. చికోటి ప్రవీణ్ బిజెపిలో చేరే అంశం చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. బిజెపి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ బిజెపిలో అతడికి సభ్యత్వం అందించారు.

ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామ్ చందర్ రావు తదితరుల సమక్షంలో చికోటి ప్రవీణ్ బిజెపి తీర్థం పుచుకున్నారు. బిజెపి నేతలు చికోటి ప్రవీణ్ కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బిజెపిలో చేరిన అనంతరం చికోటి ప్రవీణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరునాళ్లలో దారితప్పిన పిల్లవాడు తిరిగి తల్లి ఒడికి చేరినట్టుగా ఉందని పేర్కొన్నారు. కొన్నాళ్ల కిందటే బిజెపిలో చేరాల్సి ఉన్నప్పటికీ, కొంత సమాచార లోపం వల్ల చేరలేకపోయానని, ఇన్నాళ్లకు బిజెపిలోకి రావడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. బిజెపిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com