రస్ అల్ ఖైమా-ఒమన్ ముసందమ్‌ మొదటి ల్యాండ్ ట్రిప్ ప్రారంభం

- October 07, 2023 , by Maagulf
రస్ అల్ ఖైమా-ఒమన్ ముసందమ్‌ మొదటి ల్యాండ్ ట్రిప్ ప్రారంభం

రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమాను ఒమన్ సుల్తానేట్ ముసందంతో కలుపుతూ RAK ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ తొలి ల్యాండ్ ట్రిప్ సర్వీస్‌ను ప్రారంభించింది. ముసందమ్ గవర్నరేట్ భాగస్వామ్యంతో ఈ సేవ ప్రారంభించబడింది.వారాంతాల్లో రోజుకు రెండు ట్రిప్పులతో ఇది నడుస్తుంది. రెండు దేశాల మధ్య పర్యాటకాన్ని మెరుగుపరచడానికి, నివాసితులు మరియు పర్యాటకులు ఇరువురి వ్యక్తుల కదలికను సులభతరం చేయడానికి యూఏఈ నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా ఈ సేవను ప్రారంభించడం జరిగిందని RAKTA డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ హసన్ అల్ బలూషి అన్నారు. ఈ సర్వీస్ రస్ అల్ ఖైమాలోని ప్రధాన బస్ స్టేషన్ నుండి బయలుదేరి ఏడు స్టాప్‌ల గుండా వెళుతుంది. ఖసాబ్, ముసందమ్ గవర్నరేట్‌లో ముగుస్తుంది.  ప్రారంభోత్సవ వేడుకలో ముసందం గవర్నరేట్ మొదటి బస్సు యాత్రకు స్వాగతం పలికేందుకు రిసెప్షన్‌ను నిర్వహించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com