ఎన్టీయార్ ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్.! ఈ సారి హాలీవుడ్ రేంజ్.!

- October 07, 2023 , by Maagulf
ఎన్టీయార్ ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్.! ఈ సారి హాలీవుడ్ రేంజ్.!

ప్రముఖ నిర్మాత నాగవంశీ తన మనసులో మాట బయట పెట్టారు. ఎన్టీయార్‌తో ‘ఐరెన్ మ్యాన్’ తరహా సినిమా చేయాలని వుందట. ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీయార్ గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మధ్య ఓ హాలీవుడ్ నిర్మాత కూడా ఎన్టీయార్ గురించి ఈ తరహా అభిప్రాయమే వ్యక్తం చేశారు.

తాజాగా టాలీవుడ్ నిర్మాత నాగవంశీ కూడా అదే అభిప్రాయాన్ని వెల్లడించడం విశేషం. అయితే, ఎన్టీయార్ ఒప్పుకుంటే, ఈ భారీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టేందుకు నాగవంశీ రెడీగా వున్నారట. ప్రస్తుతం ఎన్టీయార్ ‘దేవర’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్యాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేయబోతున్నామని డైరెక్టర్ కొరటాల శివ వెల్లడించారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయాల్సి వుంది. ఈ రెండు సినిమాలూ పూర్తయ్యాకే వంశీ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాల్సి వుంది.

ఓ సినిమా ఈవెంట్ సందర్భంగా నాగవంశీ ఇలా తన మనసులోని మాటను బయట పెట్టారు. చూడాలి మరి, ఈ ప్రపోజల్ ఎన్టీయార్ వరకూ చేరి.. చర్చోపచర్చల అనంతరం ఆ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చేందుకు చాలా చాలానే టైమ్ పట్టే అవకాశాలున్నాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com