తెలంగాణ: తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ డబ్బు, కిలోల కొద్దీ బంగారం

- October 09, 2023 , by Maagulf
తెలంగాణ: తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ డబ్బు, కిలోల కొద్దీ బంగారం

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం పట్టుబడింది. అలాగే, పోస్టర్లు, ప్లెక్సీల తొలగింపు షురూ అయింది. ఖమ్మం జిల్లా తల్లాడలో రూ.5 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తల్లాడ పోలీస్ ఎస్ఐ పి.సురేశ్ ఆధ్వర్యంలో తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్లో తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి 5 లక్షల రూపాయలు తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. ఆ నగదుకు సంబంధించిన ఎటువంటి పత్రాలు లభించకపోవడంతో నగదును సీజ్ చేశారు.

హైదరాబాద్ శేరిలింగంపల్లి గోపన్ పల్లీ తండాలో ఓటర్లకు పంచేందుకు దాచి ఉంచిన 87 కుక్కర్లను పోలీసులు సీజ్ చేశారు. రాములు నాయక్, నర్సింహ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పీవీ మార్గ్ లో వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్టలో పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. వనస్థలిపురంలోనూ పోలీసులు వాహనాలను ఆపి చెక్ చేశారు. 4 లక్షల రూపాయలు సీజ్ చేశారు.

చందా నగర్ లో వాహనాల తనిఖీలో పెద్ద మొత్తంలో బంగారం లభ్యమైంది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో నగదు అక్రమ రవాణా పెరిగింది. నిజాం కాలేజ్ గేట్ నంబర్ వన్ వద్ద భారీగా బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com