న్యూఢిల్లీలో హై అలర్ట్
- October 13, 2023
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో.... అధికారులు న్యూఢిల్లీలో హై అలర్ట్‌ను ప్రకటించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలు చెలరేగనున్నాయనే ముందస్తు సమాచారంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు ఢిల్లీలో హై అలర్ట్‌ను ప్రకటించారు. ముఖ్యంగా శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, యూదుల సంస్థల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఇప్పటికే కేంద్రం ఆపరేషన్ అజయ్ ను ప్రారంభించింది. మొదటి విమానంలో 212 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.
దేశంలో నివసిస్తున్న ఇజ్రాయెలీయుల భద్రతను కాపాడాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ పర్యాటకులకు, దౌత్యవేత్తలు సహా సిబ్బందికి భద్రత పెంచాలని కోరింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలు ఇప్పటికే యూదుల భద్రతకు హామీ ఇస్తూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. భారత్ కూడా ఈ మేరకు చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్‌లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









