నవరాత్రుల్లో ఈ తప్పులు చేయకండి
- October 14, 2023
Devi Navratri vrat 2023 : దుర్గా మాతను ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది నవరాత్రులలో ఉపవాసం ఉంటారు. కొంతమంది మొత్తం తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. మరికొందరు మొదటి మరియు చివరి రోజులలో ఉపవాసం ఉంటారు. అయితే ఉపవాస సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి ఈ పండుగ ప్రారంభం కానుంది. నవరాత్రులలో, అమ్మవారిని 9 రోజులు ప్రతిష్టించి పూజిస్తారు.
నవరాత్రులలో మొదటి రోజున ఘట స్థాపన నిర్వహిస్తారు. ఇది నవరాత్రులలో ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి. నవరాత్రి వ్రతం పాటించేవారు ప్రతిపద తిథి నుండి దశమి వరకు నిరంతరం దీపం వెలిగించాలి. నవరాత్రులలో ప్రతిరోజూ అమ్మవారి వివిధ అవతారాలను పూజిస్తారు. పూజ సమయంలో ఎర్రని వస్త్రాలు ధరించి, వివిధ రూపాల్లో అమ్మవారికి ఎర్రని పుష్పాలను సమర్పించాలి.
దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే నవరాత్రులలో ఎవరిపైనా కోపం, పగ పెంచుకోకూడదు. ఉపవాసం ఉండే భక్తులు ఇతరులను విమర్శించడం లేదా దూషించడం మానుకోవాలి. అమ్మవారి సేవలోనే ఉండాలి. ఈ సమయంలో పేదలకు సహాయం చేయండి. తద్వారా ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం వెల్లివిరుస్తాయి. నవరాత్రులలో ఉపవాసం ఉండే భక్తులు ఈ కాలంలో షేవింగ్ లేదా జుట్టు కత్తిరించుకోవడం మానుకోవాలి. ఇలా చేస్తే దుర్గాదేవికి కోపం వస్తుందని నమ్మకం.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్‌ప్రెస్‌వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్







