పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం...
- October 14, 2023
అహ్మదాబాద్: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. పాక్ ను 191 పరుగులకే కట్టడి చేసిన భారత్… లక్ష్యఛేదనలో 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి విజయఢంకా మోగించింది. భారత బ్యాట్స్ మెన్లలో కెఫ్టెన్ రోహిత్ శర్మ (86) ఫోర్లు, సిక్స్ లతో విద్వంసం సృష్టించాడు. శ్రేయస్ అయ్యార్ 53 నాటౌట్ గా నిలిచి భారత్ కు విజయాన్ని అందించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అప్రిది రెండు వికెట్లు తీయగా హసన్ ఆలీ ఒక వికెట్ తీశాడు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు బరిలోకి దిగారు. అనారోగ్యం కారణంగా వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమైన గిల్ పాకిస్థాన్ మ్యాచ్‌తోనే రీ ఎంట్రీ ఇచ్చాడు. షాహీన్ అఫ్రీది వేసిన మొదటి ఓవర్‌లో ఓ ఫోర్ కొట్టిన గిల్ హసన్ అలీ వేసిన రెండో ఓవర్‌లో మూడు ఫోర్లు బాది మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. అయితే.. ఆ మరుసటి ఓవర్‌లో షాహీన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 23 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
అయితే.. మరో వైపు రోహిత్ శర్మ మాత్రం తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. ఏ బౌలర్‌ను లెక్క చేయలేదు. సిక్సర్లు, ఫోర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. కోహ్లీ విఫలమైనా శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో రోహిత్ 36 బంతుల్లోనే అర్థశతకాన్ని అందుకున్నాడు. ఆ తరువాత మరింత దూకుడుగా ఆడాడు. అయితే.. సెంచరీకి మరో 14 పరుగుల దూరంలో షాహీన్ అఫ్రీది బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అప్పటికే భారత విజయం ఖాయమై పోయింది. మిగిలిన పనిని కేఎల్ రాహుల్ (19 నాటౌట్) తో కలిసి శ్రేయస్ అయ్యర్ పూర్తి చేశాడు. అయ్యర్ 62 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







