'గల్ఫ్' సినిమా దర్శకులు శ్రీ పి.సునీల్ కుమార్ రెడ్డి గారికి షార్జాలో ప్రవాసీల ఆత్మీయ స్వాగతం

- June 26, 2015 , by Maagulf
'గల్ఫ్' సినిమా దర్శకులు శ్రీ పి.సునీల్ కుమార్ రెడ్డి గారికి షార్జాలో ప్రవాసీల ఆత్మీయ స్వాగతం

ప్రముఖ సినీ దర్శకులు శ్రీ పి.సునీల్ కుమార్ రెడ్డి తమ తదుపరి చిత్రమైన 'గల్ఫ్' చిత్ర నిర్మాణ నిమిత్తం షార్జా చేరుకున్నారు. మన ప్రవాసీలు శ్రీ జనగామ శ్రీనివాస్(షార్జా),శ్రీ పరశురాం(షార్జా),శ్రీ శనిగరపు గంగారెడ్డి(దుబాయ్) డైరెక్టర్ గారికి స్వాగతం పలికారు.
నాలుగు రోజులపాటు దుబాయ్, అబుదాబి లను సందర్శిస్తారు.ఒక రోజు లేబర్ క్యాంపులో నిద్రించుట, ఒక రోజు తెలుగు సంఘాలతో సమావేశం, గల్ఫ్ ప్రవాసి జీవన స్థితిగతుల అధ్యయనం, వీలయితే ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ లు, జైళ్ళు సందర్శించడం.తర్వాత రోడ్డు మార్గంలో ఒమాన్ దేశ పర్యటనకు వెళతారు.
ఈ సినిమాలో నటించాలనుకునే ఉత్సాహవంతులు ప్రయత్నించవచ్చు.

 

--సి.శ్రీ(దుబాయ్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com