డిసెంబర్‌లో విశాఖకు షిఫ్ట్: సీఎం జగన్
- October 16, 2023
విశాఖపట్నం: తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. డిసెంబర్ లోగా వైజాగ్ కు వచ్చేస్తున్నానని తెలిపారు. విశాఖలో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని కాసేపటి క్రితం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తాను వైజాగ్ కు షిఫ్ట్ అవుతున్నట్టు తెలిపారు. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తానని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు మాదిరి వైజాగ్ ఐటీ హబ్ గా మారుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్ గా మారిందని చెప్పారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయని తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలని… ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కల్పిస్తామని అన్నారు. వైజాగ్ లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు







