176 మంది సౌదీలు, నివాసితులు అరెస్ట్
- October 17, 2023
రియాద్: సౌదీ అరేబియా పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) 1445 AH రబీ అల్-అవ్వల్ నెలలో 3,601 పర్యవేక్షణ పర్యటనలను నిర్వహించింది. ఈ సందర్భంగా 369 మంది అవినీతి అనుమానితులపై దర్యాప్తు చేసింది. 369 మంది అనుమానితుల్లో అంతర్గత, రక్షణ, న్యాయ, ఆరోగ్యం, విద్య, మునిసిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు మరియు హౌసింగ్, అలాగే జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ వంటి అనేక ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు ఉన్నారని నజాహా తెలిపింది. విచారణ ప్రక్రియ తర్వాత 176 మంది సౌదీ పౌరులు, నివాసితులను అరెస్టు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ చట్టం ప్రకారం.. ఆ పౌరులు బెయిల్‌పై విడుదలయ్యారని నజాహా చెప్పింది. అరెస్టుకు గల కారణాల విషయానికొస్తే.. వారందరూ లంచం, అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్, అలాగే ఫోర్జరీకి పాల్పడ్డారని అథారిటీ తెలిపింది. టోల్-ఫ్రీ నంబర్: 980, ఇమెయిల్: [email protected], ఫ్యాక్స్: 114420057 ద్వారా ఆర్థిక లేదా పరిపాలనా అవినీతికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద చర్యలను నివేదించాలని నజాహా కోరింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







