గ్లోబల్ విలేజ్ టిక్కెట్ ధరలు, బాణసంచా షెడ్యూల్
- October 18, 2023
దుబాయ్: దుబాయ్ గ్లోబల్ విలేజ్‌కి ప్రవేశ టిక్కెట్‌లు ఇప్పుడు పార్క్ యాప్, వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. 28వ సీజన్ అక్టోబర్ 18న ప్రారంభమవుతుంది. మొదటి రోజు సాయంత్రం 6 గంటలకు ప్రజలకు ప్రవేశం కల్పిస్తారు. రెండు రకాల టిక్కెట్ల ధరలను పెంచారు. సందర్శకులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. టిక్కెట్ల ధరలను గేట్ వద్ద Dh25; Dh22.5 ఆన్‌లైన్ గా నిర్ణయించారు. ఆదివారం నుండి గురువారం వరకు తెరిచి ఉంటుంది (ప్రభుత్వ సెలవులు మినహా). Dh30 టిక్కెట్‌లతో సందర్శకులకు వారాంతాల్లో.. ప్రభుత్వ సెలవు దినాలతో సహా వారంలోని ఏ రోజునైనా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించారు. సీనియర్ సిటిజన్లు, మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో ఒకరు ఉచితంగా ప్రవేశించవచ్చు. ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9 గంటలకు బాణసంచా ప్రదర్శనను నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







