ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం.. యూఎన్ తీరుపై యూఏఈ అసంతృప్తి!
- October 18, 2023
యూఏఈ: గాజాలోని పౌరులు మరోసారి యుద్ధాన్నిఎదుర్కొంటున్నారని యూఏఈ పేర్కొంది. యూఎన్ భద్రతా మండలి అత్యవసర మానవతా అవసరాలకు ప్రతిస్పందించడానికి కలిసి రాలేకపోయిందని తెలిపింది. పౌరులపై హింస మరియు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ.. రష్యా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని యూఎన్ తిరస్కరించింది. అక్టోబర్ 7న హమాస్ జరిపిన ఆకస్మిక దాడిలో 1,300 మంది ఇజ్రాయిలీలు మరణించారు. ఇజ్రాయెల్ ప్రతీకార వైమానిక దాడులలో 2,750 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఉత్తరాన ఉన్న గాజన్లు దక్షిణం వైపు వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితిలో యూఏఈ శాశ్వత ప్రతినిధి లానా నుస్సీబెహ్ మాట్లాడుతూ.. ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలను తరలించడం అన్యాయమైన చర్యగా అభివర్ణించారు. గాజాలో 1.3 మిలియన్ల మందికి వారి ప్రాథమిక మనుగడ కోసం సహాయం అవసరమని ఆమె అన్నారు. ఇంధనం, ఆహారం, నీరు, వైద్య సహాయం మరియు ఇతర ప్రాథమిక అవసరాలకు వారు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. పాలస్తీనియన్లు, ఇజ్రాయెల్‌లు తమ స్వంత స్వతంత్ర, సంపన్నమైన , సురక్షితమైన రాష్ట్రాల్లో జీవించేందుకు యూఏఈ మద్దతు ఇస్తుందని తెలిపారు. రెండు అభివృద్ధి చెందాలని యూఏఈ ఆకాంక్ష అని నుస్సీబే అన్నారు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







