ట్రీ ప్లాంటేషన్ ఉద్యమాన్ని ప్రారంభించిన ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ విద్యార్థులు
- October 19, 2023
కువైట్: ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైట్ కువైట్‌లో ట్రీ ప్లాంటేషన్ ఉద్యమాన్ని ప్రారంభించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చరల్ అఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్‌తో కలిసి తన పర్యావరణ అనుకూల కార్యకలాపాలతో పర్యావరణాన్ని పరిరక్షించడంలో కొత్త ఉద్యమాన్ని ప్రారంభించింది. 2023 అక్టోబరు 16వ తేదీన అబ్రాజ్ పార్క్ హవల్లీలో 150 మొక్కలు నాటడం ద్వారా ప్రకృతి పరిరక్షణ కోసం కువైట్ మంత్రిత్వ శాఖతో సహకరించిన కువైట్‌లోని మొదటి భారతీయ పాఠశాలగా ICSK నిలిచింది. ICSK సైన్స్ క్లబ్‌కు చెందిన 150 మంది విద్యార్థులు ఈ డ్రైవ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొక్కలను ఎలా సంరక్షించాలో విద్యార్థులకు అతిథులు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు ప్రత్యేక క్లీనింగ్ డ్రైవ్ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. పార్క్ ప్రాంగణాన్ని శుభ్రం చేయడంలో చురుకుగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..