బహ్రెయిన్ లో మిడిల్ ఈస్ట్‌లో అతిపెద్ద స్కూల్ స్పోర్ట్ ఈవెంట్
- October 19, 2023
బహ్రెయిన్: వచ్చే ఏడాది అక్టోబర్‌లో బహ్రెయిన్‌లో ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ISF) జిమ్నాసియాడ్ 2024 క్రీడా కార్యక్రమం జరగనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువకుల మధ్య విద్య, సాంస్కృతిక మార్పిడికి కూడా ఇది అవకాశంగా ఉంటుంది. ISF ప్రెసిడెంట్ లారెంట్ పెట్రింకా మాట్లాడుతూ.. ఇది కేవలం క్రీడకు సంబంధించినది కాదని,ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ తరాల మధ్య విద్య, సాంస్కృతిక మార్పిడికి సంబంధించినదని పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్‌లో ఈవెంట్‌ను నిర్వహించడంలో ముందున్నందుకు బహ్రెయిన్‌కు పెట్రింకా తన కృతజ్ఞతలు తెలిపారు. బహ్రెయిన్‌లోని అమెరికన్ యూనివర్సిటీ ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పురోగతిని వెల్లడించారు. ISF జిమ్నాసియాడ్ 2024 కోసం ఎగ్జిక్యూటివ్ LOC చైర్మన్ ఇషాక్ అబ్దుల్లా ఇషాక్ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను కార్యక్రమంలో అంతర్జాతీయ అధికారులకు అందించారు. ISF జిమ్నాసియాడ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల క్రీడల కార్యక్రమం. 80 కంటే ఎక్కువ దేశాల నుండి 5,000 మంది విద్యార్థులు 25 విభిన్న క్రీడలలో పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్ 2024 అక్టోబర్ 23–31 మధ్య బహ్రెయిన్‌లో జరుగుతుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..