గాజాలో మానవతా కారిడార్‌ల కోసం UN సెక్రటరీ జనరల్ తో మాట్లాడిన క్రౌన్ ప్రిన్స్

- October 21, 2023 , by Maagulf
గాజాలో మానవతా కారిడార్‌ల కోసం UN సెక్రటరీ జనరల్ తో మాట్లాడిన క్రౌన్ ప్రిన్స్

రియాద్: గాజా పౌరుల కోసం మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేయడంలో UN కీలక పాత్ర పోషించాలని క్రౌన్ ప్రిన్స్,  ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్  కోరారు. ఈ మేరకు UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో ఫోన్ కాల్‌లో మాట్లాడారు. గాజాలో కొనసాగుతున్న సైనిక తీవ్రతపై ఈ సందర్భంగా చర్చించారు. సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి,  తీవ్రతను తగ్గించడానికి అంతర్జాతీయ -ప్రాంతీయ ప్రయత్నాలను తీవ్రతరం చేయవలసిన అవసరాన్ని క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు. క్రౌన్ ప్రిన్స్ ప్రాంతీయ, ప్రపంచ భద్రతపై సంభావ్య ప్రమాదకరమైన పరిణామాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.  శాంతి ప్రక్రియను పునరుద్ధరించడం ఆవశ్యకతను వివరించారు. పాలస్తీనా ప్రజలు చట్టబద్ధమైన హక్కులను పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు క్రౌన్ ప్రిన్స్ గాజాలో ముట్టడిని ఎదుర్కొంటున్న పౌరులకు అవసరమైన వైద్య సంరక్షణ,  ఆహారాన్ని అందించడానికి సురక్షితమైన మానవతా కారిడార్‌లను అందించడంలో UN మరియు దాని సంస్థల కీలక పాత్ర పోషించాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com