పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమం..సిఎం జగన్ కీలక ప్రకటన
- October 21, 2023
విజయవాడ: సిఎం జగన్ విజయవాడలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో కీలక ప్రకటన చేశారు. ప్రతి పోలీసుకు ఇన్యూరెన్స్ కింద రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల బీమా కవరేజీ ఇచ్చేందుకు ఎస్బీఐ ముందకొచ్చిందని వెల్లడించారు. ఈ మేరకు ఆ బ్యాంకుతో నెగోషియేషన్ పూర్తియిందని ప్రకటన చేశారు. విధి నిర్వహణలో ప్రాణం వదిలిన పోలీస్ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని.. పోలీస్ ఉద్యోగం ఒక సవాల్ అన్నారు. ప్రస్తుత రోజుల్లో నేరం తన రూపాన్ని మార్చుకుంటోందని.. కొత్త టెక్నాలజీ వల్ల సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా చోరీ వరకు నేరాలు జరుగుతున్నాయని చెప్పారు.
అసాంఘిక శక్తులు అనే పదానికి రీ డిఫైన్ చేయాలన్నారు. ప్రశాంతంగా సాగుతున్న ప్రజా జీవితాన్ని తమ స్వార్థం కోసం దెబ్బ తీస్తున్న శక్తులన్నీ కూడా అసాంఘిక శక్తులేనని.. ప్రభుత్వం, సమాజం మీద దాడి చేసి మనుగడ సాగించాలని అనుకునే శక్తులు అన్నీ కూడా అడవుల్లో, అజ్ఞాతంలో లేవని చెప్పారు. ప్రజా జీవితంలో ఉంటూ ప్రజా జీవితం మీద దాడి చేయటం ఈ మధ్య చూస్తున్నామని సిఎం జగన్ వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ రియల్టీ అమ్మకాల్లో 37% పెరుగుదల..!!
- దక్షిణ యెమెన్ సమస్యకు రియాద్ చర్చలతో పరిష్కారం..!!
- దుబాయ్ లో విల్లా ఫైనాన్సింగ్ స్కామ్..ముగ్గురికి జైలుశిక్ష..!!
- రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్‌పై కువైట్, సౌదీ చర్చలు..!!
- ఇరాన్‌కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..







