'భారత జాగృతి యూఏఈ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు'
- October 22, 2023
అజ్మాన్: అజ్మాన్ లోని మైత్రి ఫార్మ్ లో భారీ జన సందోహం నడుమ భారత జాగృతి యూఏఈ శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం 3.00 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు గ్రామీణ జీవన సంస్కృతిని ప్రతిబింబించే మాదిరిగా 'బతుకమ్మ సంబరాలు' ఎంతో అట్టహాసంగా జరిగాయి.
ముందుగా కళాకారులు డప్పు వాయిద్యాలతో బతుకమ్మలను ఎదుర్కొన్నాక మహిళలు అందరు కలిసి గౌరీ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలను ప్రతిబింబించే విధంగా ఆడపడుచులు సాంప్రదాయ దుస్తుల్లో అందమైన బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరు కావడం మరియు బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడి పాడటంతో వేదిక అంతా గొప్ప పండగ వాతావరణంతో నిండి పోయింది.
అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ, భారీ ఎత్తున నిర్వహించబడిన సంబరాలు చూసి బతుకమ్మను నిర్వహిస్తున్న భారత జాగృతి యూఏఈ వారి కృషిని కొనియాడారు. జాగృతి యూఏఈ విభాగం మొదటి సారి స్వంతంగా బతుకమ్మ పండుగను నిర్వహించడం చాల సంతోషాన్ని కలిగించిందని , ఇలాంటి సాంస్కృతిక పరమైన వేడుకలు భావితరాలకు మన ఆచార సంప్రదాయాలను తెలియచేయడానికి దోహదపడుతాయని హాజరైన అథితులు పేర్కొన్నారు. మహిళల బతుకమ్మ పాటలు శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసాయి. చిన్నపిల్లలు సైతం సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ చప్పట్లతో హుషురూగా ఆడిపాడటం అందరిని ఆకట్టుకొన్నాయి.
కార్యక్రమానికి హాజరైన మహిళలందరు కలిసి ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు. తెలంగాణ తలమానికమైన బతుకమ్మ సంబరాలను గొప్పగా జరుపుకోవడం చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు తీసుకొచ్చిన రంగు రంగు పూల బతుకమ్మలు చూపరులను ఎంతగానో ఆకర్షించాయి. మహిళా సభ్యులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు బతుకమ్మ కోలాటాలు, జానపద నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి . వెళ్లి రావమ్మ బతుకమ్మ అంటూ గౌరమ్మను తలుస్తూ బతుకమ్మలను ఏర్పాటు చేసిన కొలనులో నిమ్మర్జనం చేశారు, కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి బతుకమ్మ ప్రసాదంను నిర్వాహకులు అందజేయడం జరిగింది.
ఈ వేడుకకు మైత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు KK ఇన్వెస్ట్మెంట్ ప్రధాన స్పాన్సర్ కాగా, సెవెన్ హిల్స్ ,హయతి టెక్నికల్ సర్వీస్, బ్లు మార్క్ టెక్నికల్ సర్వీస్ ,వీ స్మార్ట్ టెక్నికల్ సర్వీస్ ,అవెన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ లెమన్ స్టూడియో కో స్పాన్సర్ గా వ్యవహరించారు , కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్స్ అందరిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు
ఈ సంబరాల్లో భారత్ జాగృతి యూఏఈ అధ్యక్ష్యులు వెంకటేశ్వర్ రావు పీచర, ఉపాధ్యక్ష్యులు ఆరె శేఖర్ గౌడ్, సభ్యులు అరవింద్ రాగం ,రాజేష్ పోలంపల్లి ,శ్రీనివాస్ రెడ్డి ,ఉష శ్రీకాంత్ ,అన్నపూర్ణ ,మౌనిక,రాణీ కోట్లా మరియూ ముఖ్య అతిథులు గా గుండెల్లి నర్సింహా, కిరణ్ కుమార్ పీచర, మామిడి శ్రీనివాస్ రెడ్డి ,రాదారపు సత్యం మరియు పలు తెలుగు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.













తాజా వార్తలు
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!







