గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం యూఏఈ పిలుపు
- October 22, 2023
యూఏఈ: కైరో శాంతి సదస్సులో ప్రపంచ నాయకులతో కలిసి గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ముగించాలని దే యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శనివారం పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్ - హమాస్ గ్రూపు మధ్య జరుగుతున్న యుద్ధం గురించి చర్చించడానికి ఈజిప్ట్ అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించింది. "యూఏఈ పౌరుల జీవితాలకు అత్యంత రక్షణ, మానవతా సహాయానికి అడ్డంకులు లేని యాక్సెస్ కల్పించాలి. గాజా స్ట్రిప్‌లోని శత్రుత్వాలను తక్షణమే ముగించాలి." అని షేక్ మొహమ్మద్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు. మరింత హింస, విస్తృత అస్థిరతను నివారించడానికి కలిసి పని చేయాలని అధ్యక్షుడు అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఈజిప్టు యొక్క రాఫా క్రాసింగ్ ప్రారంభమైన వెంటనే, మానవతా సహాయ కాన్వాయ్ గాజా స్ట్రిప్‌కు చేరుకోవడానికి వీలుగా శిఖరాగ్ర సమావేశం జరిగింది. శిఖరాగ్ర సమావేశానికి హాజరైన యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ పాటించాలని కోరారు. యుద్ధంలో ఇప్పటికీ వేలాది మంది చనిపోయారని, ఒక మిలియన్ పాలస్తీనియన్లు స్వస్థలాలను విడిచారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్‌లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









