లాజిస్టిక్స్ హబ్‌గా సిత్రా ఇండస్ట్రియల్ పార్క్

- October 23, 2023 , by Maagulf
లాజిస్టిక్స్ హబ్‌గా సిత్రా ఇండస్ట్రియల్ పార్క్

బహ్రెయిన్: సిత్రా ఇండస్ట్రియల్ పార్క్‌లో మరో రెండు గిడ్డంగులు నిర్మిస్తున్నారు. ఇది బహ్రెయిన్ అత్యంత సమగ్రమైన లాజిస్టిక్స్ హబ్‌గా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. టెండర్ బోర్డు పది నెలల ప్రాజెక్ట్‌ను పౌల్లైడ్స్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది. ఇది ప్రాంతీయ, అంతర్జాతీయంగా 18 కంపెనీలతో పోటీ పడి కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. బహ్రెయిన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎడమా) ప్రకారం.. సిత్రా ఇండస్ట్రియల్ పార్క్ 87,382 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. పారిశ్రామిక, వాణిజ్య మరియు రవాణా ప్రయోజనాల కోసం నియమించబడిన డ్రై స్టోరేజీ ప్లాట్‌ల నిర్మాణం కోసం ప్రణాళికలు రెడీగా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఎడామా పార్క్‌ను 8,000 చదరపు మీటర్ల మేర విస్తరించాలని నిర్ణయించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com