8 నెలలలో ఈ-స్కూటర్ ప్రమాదాల్లో 5 మంది మృతి, 29 మందికి గాయాలు

- October 25, 2023 , by Maagulf
8 నెలలలో  ఈ-స్కూటర్ ప్రమాదాల్లో 5 మంది మృతి, 29 మందికి గాయాలు

దుబాయ్: గత ఎనిమిది నెలలుగా దుబాయ్‌లో జరిగిన ఈ-స్కూటర్ ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. ఇ-స్కూటర్‌లపై  32 ప్రమాదాలు  నమోదుఖ్యినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.  

ఎనిమిది నెలల్లో రైడర్లపై 10,000 జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. రైడర్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వీడియోను పోలీసులు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే రైడర్‌లపై 300 దిర్హామ్‌ల జరిమానా విధించబడుతుందని, 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇ-స్కూటర్‌ను నడపడం వంటి ఉల్లంఘనలను వీడియోలో చూపించారు.  ఈ-స్కూటర్ రైడర్లు అన్ని సంబంధిత భద్రతా నియమాలను పాటించాలని అధికారి కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com