తేజ్ తుఫాన్ ఎఫెక్ట్: ధోఫర్‌లో భారీ వర్షాలు, ట్రాఫిక్‌కు అంతరాయం

- October 25, 2023 , by Maagulf
తేజ్ తుఫాన్ ఎఫెక్ట్:  ధోఫర్‌లో భారీ వర్షాలు, ట్రాఫిక్‌కు అంతరాయం

మస్కట్: యెమెన్‌ను తాకిన తేజ్ తుఫాన్ భారీ వర్షాలను తీసుకురావడమే కాకుండా రోడ్లను కూడా దెబ్బతీసింది. విద్యుత్ మరియు కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు అంతరాయం కలిగించింది. ధోఫర్ గవర్నరేట్‌లోని రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ తబుక్ మాట్లాడుతూ.. తేజ్ తుఫాన్ వల్ల ప్రభావితమైన గవర్నరేట్‌లోని చాలా రహదారులను తిరిగి ప్రారంభించామని, అర్గుట్-అషిఖర్ట్ రోడ్ మాత్రం  నిరంతర వర్షాల కారణంగా మూసివేసినట్లు తెలిపారు. దోఫర్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ బృందాలు ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో పునరుద్ధరణ కార్యకలాపాలను నిర్వహించాయని తబుక్ ఒమన్ పేర్కొన్నారు. ప్రవహించే వాడీలు, నిరంతర వర్షాల కారణంగా నీటి మట్టాలు పెరగడం వల్ల కొన్ని రహదారులు మూసివేసినట్లు తబుక్ చెప్పారు. తుఫాను ఈ ప్రాంతంలో తీరం దాటడానికి ముందు ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంతో మానవ నష్టాలు లేదా మునిగిపోయిన సంఘటనల సంఖ్య భారీగా తగ్గిందన్నారు.  తేజ్ కారణంగా ధోఫర్ గవర్నరేట్‌లోని రఖ్యూత్ విలాయత్‌లో అక్టోబరు 22 , నుండి అక్టోబర్ 24 వరకు 200 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. వ్యవసాయం, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం..  రఖ్యూత్‌లోని విలాయత్‌లో 232 మిమీ, ధాల్‌కుట్‌లోని విలాయత్‌లో 203 మిమీ, సలాలా విలాయత్‌లో 56 మిమీ వర్షపాతం నమోదైంది.అక్టోబరు 25-26 తేదీలలో ధాల్‌కుట్, రఖ్యూత్ మరియు అల్-మజ్యోనాలోని కొన్ని ప్రాంతాలలోని విలాయత్‌లలోని అన్ని పాఠశాలలకు  సెలవులు ప్రకటించారు. అల్పపీడనంగా మారిన తుఫాను బుధవారం ఉదయం వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com