అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి
- October 26, 2023
వాషింగ్టన్: మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో బుధవారం రాత్రి ఓ ఆగంతుకుడు కాల్పులకు తెగబడటంతో 22 మంది దుర్మరణం చెందారు. సెమీ ఆటోమేటిక్ తుపాకీతో నిందితుడు ఓ బౌలింగ్ యాలీ, మరో రెస్టారెంట్లో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో మరో 60 మంది గాయాల పాలయ్యారు.
ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అతడి ఫొటోను కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆ ప్రాంతంలోని వ్యాపారాలను మూసేయాలని పోలీసులు స్థానికులకు సూచించారు. కాగా, ఈ దారుణంపై మెయిన్ చట్టసభ సభ్యుడు జేరెడ్ గోల్డెన్ ‘ఎక్స్’ వేదికగా విచారం వ్యక్తం చేశారు. తాను భయభ్రాంతులకు లోనైనట్టు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







