సౌదీ అరేబియా, దక్షిణ కొరియా భవిష్యత్తు విజయానికి మార్గం సుగమం
- October 26, 2023
రియాద్: సౌదీ అరేబియా, దక్షిణ కొరియా ఆవిష్కరణలు.. వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా భవిష్యత్తు విజయానికి మార్గం సుగమం చేశాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సౌదీ అరేబియాలో పర్యటన ముగింపు సందర్భంగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి భాగస్వామ్య నిబద్ధతను ఇందులో పేర్కొన్నారు. వివిధ రంగాలలో సహకారాన్ని విస్తృతం చేయాలనే సంకల్పాన్ని చెబుతూ.. సహకారం యొక్క కీలక రంగాలను ఈ ప్రకటన హైలైట్ చేసింది. ఈ పర్యటనలో క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్, అధ్యక్షుడు యూన్ ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ సమస్యలు మరియు ప్రపంచ వ్యవహారాల అభివృద్ధిపై వివరణాత్మక చర్చలలో పాల్గొన్నారు. 2022లో క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ దక్షిణ కొరియా పర్యటన తర్వాత సానుకూల ఫలితాల పట్ల ఇరుపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. వారి వ్యూహాత్మక సంబంధాలను పటిష్టం చేయడానికి, ఉమ్మడి ప్రాజెక్టులను సమర్థవంతంగా సమన్వయం చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని స్థాపించడానికి కుదిరిన ఒక ఒప్పందంపై సంతకం చేశారు. సౌదీ అరేబియా విజన్ 2030కి దక్షిణ కొరియా దృఢమైన మద్దతును అధ్యక్షుడు యూన్ ధృవీకరించారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వంలో సాధించిన పురోగతిపై ప్రశంసలు కురిపించారు. సౌదీ-కొరియా విజన్ 2030 కమిటీకి రెండు దేశాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్ సిటీలు, స్టార్టప్‌లు వంటి రంగాలలో పరస్పర పెట్టుబడులను అన్వేషించడానికి అంగీకరించారు. ఉమ్మడి ముడి చమురు నిల్వ ప్రాజెక్ట్ ఒప్పందంపై సంతకం చేశారు. వాతావరణ మార్పులను పరిష్కరించడంలో మరియు హైడ్రోజన్ ఒయాసిస్ ఇనిషియేటివ్ (H2Oasis) వంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంలో ఇరుపక్షాలు తమ నిబద్ధతను హైలైట్ చేశాయి. రవాణా, లాజిస్టిక్స్ మరియు పర్యాటక రంగాలలో సహకార విస్తరణపై దేశాలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. షిప్పింగ్, ఓడరేవులు, స్మార్ట్ వ్యవసాయంలో సహకారాన్ని విస్తరించడానికి ఇరుపక్షాలు తమ నిబద్ధతను వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







