బహ్రెయిన్ రాజు కింగ్ హమాద్ ప్రైజు కోసం నామినేషన్ల స్వీకరణ

- June 26, 2015 , by Maagulf
బహ్రెయిన్ రాజు కింగ్ హమాద్ ప్రైజు కోసం నామినేషన్ల స్వీకరణ

 

విద్యారంగంలో ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) లను వినియోగించి, సత్ఫలితాలను రాబట్టినవారికి యునెస్కో వారిచే ఈయబడుతున్న కింగ్ హమాద్ బిన్ ఈస అల్ ఖలీఫా ప్రైజు కోసం రెండవ సంవత్సరానికై యునెస్కో వారి వెబ్‌సైట్ ద్వారా నామినేషన్లు ఆహ్వానిస్తున్నారు. 2015 సంవత్సరానికి -"పెదగొగికల్ ఇన్నోవషన్ ఇన్ ద యూజ్ ఆఫ్ ICT ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్" అనే అంశంపై ఈయనున్నారని తెలిపారు.


నామినేషన్ల స్వీకరణకు నవంబర్ 10 ఆఖరుతేదీ అని విద్యాశాఖామంత్రి డా. మజిద్ అల్ నువైమీ తెలిపారు. బహ్రైన్ దేశ ఆర్ధిక సహాయంతో, విద్యారంగంలో అభ్యాసనం, బోధన మరియు అన్ని అంశాలలో ICT ని సృజనాత్మకంగా వినియోగించిన వ్యక్తులకు, సంస్థలకు మరియు ప్రభుత్వేతర సంస్థల యొక్క ప్రోజక్టులు మరియు కార్య కలాపాలకు ఈ బహుమతిని ఇస్తారని ఆయన తెలిపారు.

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com