‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టేటస్ ఏంటబ్బా.!

- October 26, 2023 , by Maagulf
‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టేటస్ ఏంటబ్బా.!

ఓ వైపు ‘ఓజీ’, ఇంకో వైపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెండు సినిమాలూ సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటున్నాయని అన్నారు. అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ‘ఉస్తాద్’ షూటింగ్ జరగడం లేదని తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ నోటి వెంట ఆ సినిమా టైటిల్ తప్పుగా వచ్చిందని అంటున్నారు.

అసలు మ్యాటర్ ఏంటంటే, ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్ అక్కడి వేదికపై తన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరును తప్పుగా (సర్దార్ భగత్ సింగ్) పలికారు.
అదేంటీ.! తాను నటిస్తున్న సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్‌కి తెలియకపోవడమేంటీ.? పొరపాటుగానే వచ్చి వుండొచ్చు. కానీ, ఈ విషయాన్ని పట్టుకుని లాగి లాగి వదిలి పెడుతున్నారు యాంటీ పవన్ అభిమానులు.

ఇదే ‘ఉస్తాద్’ షూటింగ్ జరగడం లేదట.. అని సంకేతాలిచ్చేందుకు కారణమైంది. కానీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ నిరాటంకంగా జరుగుతోందని హరీష్ శంకర్ చెబుతున్నారు.

ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఈ సినిమాపై అంచనాలు పెట్టుకుంటారో ఖచ్చితంగా అంతకు మించి అనేలానే సినిమా వుండబోతోందనీ అంటున్నాడు. ఏమో ఎందులో ఎంత నిజముందో.! ఏమో.! కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయాల ప్రభావం ఈ సినిమా షూటింగ్‌పై చాలా చాలా ఎక్కువగా పడుతోందని అర్ధం చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com