యూఏఈలో వాహనదారులకు హెచ్చరికలు జారీ
- October 26, 2023
యూఏఈ: దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో అనేక రహదారులు కొట్టుకుపోయాయి. ఎమిరేట్స్ అంతటా వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ మేరకు అబుదాబి పోలీసులు ఒక అత్యవసర అలెర్ట్ ను జారీ చేశారు. వర్షం పడే సందర్భంలో వాహనాల వేగాన్ని తగ్గించాలని డ్రైవర్లను కోరారు. ముందుజాగ్రత్తగా నివాసితులకు మొబైల్ ఫోన్లలో సైరన్ హెచ్చరికలు పంపించినట్లు పేర్కొన్నారు. రాజధానిలోని అనేక రహదారులు వేగాన్ని తగ్గించే వ్యవస్థలను యాక్టివేట్ చేశామని, ఇవి వేగ పరిమితిని గంటకు 80 కిమీకి తగ్గించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా..ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని కోరింది.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







