గాజాలో పౌరులే లక్ష్యంగా దాడులు.. ఖండించిన అరబ్ దేశాలు

- October 27, 2023 , by Maagulf
గాజాలో పౌరులే లక్ష్యంగా దాడులు.. ఖండించిన అరబ్ దేశాలు

యూఏఈ: పౌరులను లక్ష్యంగా చేసుకోని ఇజ్రాయెట్ వైమానికి దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని యూఏఈ తోపాటు ఇతర ఎనిమిది అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు  యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్, ఈజిప్ట్ మరియు మొరాకో విదేశాంగ మంత్రులు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గాజా స్ట్రిప్‌లో తక్షణ మరియు స్థిరమైన కాల్పుల విరమణ కోసం UN భద్రతా మండలికి పిలుపునిచ్చారు. అక్టోబరు 21న ఈజిప్టు రాజధానిలో జరిగిన 'కైరో శాంతి శిఖరాగ్ర సదస్సు' తర్వాత తాజా ప్రకటన వెలువడింది.  అంతర్జాతీయ మానవతా చట్టాలతో సహా 1949 జెనీవా ఒప్పందాల ప్రోటోకాల్‌లను పాటించాల్సిన ఆవశ్యకతను అరబ్ దేశాలు గుర్తుచేసాయి.  బాధిత పాలస్తీనా ప్రజలకు ఆర్థిక మరియు వస్తుపరమైన సహాయాన్ని అందించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com