కీలక ఒప్పందాలతో ముగిసిన మోడీ ఇరాన్ పర్యటన
- May 23, 2016
ఇరాన్ పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ తో 12 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో మోదీ ఆ దేశాధ్యక్షుడు హాసన్ రౌహానితో సమావేశమయ్యారు. దైపాక్షిక సంబంధాల్లో భాగంగా కీలకమైన చాబహార్ పోర్టు నిర్మాణానికి భారత్ 500 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం చేస్తుందని మోదీ ప్రకటించారు. చాహాబర్ పోర్టు భారత్-ఇరాన్ ల మధ్య సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని హాసన్ అన్నారు. భారత్, ఇరాన్ లు కొత్త స్నేహితులేంకారని పూర్వం నుంచే ఇరాన్ తో భారత్ కు మంచి సంబంధాలున్నాయని మోదీ తెలిపారు. కాగా, భారత్ ఇతర దేశాల కోసం నిర్మించనున్న మొదటి పోర్టు ఇదే కావడం గమనార్హం. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే పాకిస్తాన్ తో సంబంధం లేకుండా మధ్య ఆసియా దేశాల నుంచి భారత్ కు సముద్ర మార్గం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఎగుమతులు, దిగుమతులకు రవాణా సులభతరం కానుంది. పాకిస్తాన్ కు చెందిన సముద్రభాగం నుంచి ఎటువంటి రవాణాకు ఆ దేశం అంగీకరించకపోవడంతో ఇప్పటివరకు మధ్య ఆసియా దేశాలతో భారత్ కు పెద్దగా వ్యాపార సంబంధాలేవీ లేకుండా పోయాయి.
దీంతో భారత్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా.. అటువైపు పాకిస్తాన్ కు గ్వాదర్ పోర్టు నిర్మించి ఇస్తూ వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటున్న చైనాకు కూడా చెక్ పెట్టేసింది. పనిలో పనిగా ఇరాన్ లోని పోర్టు నుంచి అక్కడి ముఖ్యనగరాల్లో ఒకదానికి 500 కిలోమీటర్ల మేర వేయనున్న రైల్వే మార్గానికి కూడా సాయం చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎకనమీ, ట్రాన్స్ పోర్టెషన్, పోర్టు డెవలప్ మెంట్, కల్చర్, సైన్స్, అకడమిక్ కో-ఆపరేషన్ తదితరాలపై ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. చివరగా15 ఏళ్ల కిందట అప్పటి భారత ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఇరాన్ లో పర్యటించారు.
ఇరాన్ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌కు బయల్దేరారు. రెండ్రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకొని మోదీ స్వదేశానికి పయనమయ్యారు. ఆదివారం సాయంత్రం టెహ్రాన్ చేరుకున్న మోదీ తొలుత గంగాసింగ్ సాభా గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో భేటీ అయి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 15 ఏళ్లలో భారత ప్రధాని ఇరాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







