టాప్ 50 గ్లోబల్ సిటీలలో దోహా
- October 28, 2023
దోహా: ఖతార్ రాజధాని దోహా.. కెర్నీ 2023 గ్లోబల్ సిటీస్ ఇండెక్స్‌లో 13 స్థానాలు ఎగబాకింది. ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛ ప్రీ-పాండమిక్ స్థాయిలకు తిరిగి రావడం, వలస ప్రతిభను మరియు పర్యాటకాన్ని పెద్ద మొత్తంలో ఆకర్షించడం ద్వారా ఇది సాధ్యమైంది. FIFA ప్రపంచ కప్ ఖతార్ 2022 1.4 మిలియన్ల మంది సందర్శకులను స్వాగతించిన విషయం తెలిసిందే. ఇటీవలి సంవత్సరాలలో ప్రవేశపెట్టిన ఓపెన్ ఎకనామిక్ పాలసీల ప్రయోజనాల కారణంగా టాప్ 50లోకి ప్రవేశించింది. ప్రముఖ గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయిన కెర్నీ.. ప్రఖ్యాత సూచిక, ప్రపంచ నగరాల స్థాయిలను హైలైట్ చేస్తుంది. క్రీడలు, పర్యాటకం మరియు ఈవెంట్‌ల హబ్‌గా మారిన దోహా మొదటిసారిగా టాప్ 50లోకి చేరుకుందని తెలిపింది. అదే సమయంలో ప్రాంతీయంగా రెండవ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్‌లో ఖతార్ ఈ ఏడాది రెండు స్థానాలు ఎగబాకి ప్రపంచంలో 21వ స్థానంలో నిలిచిందని కెర్నీ పార్టనర్ రుడాల్ఫ్ లోహ్మేయర్ తెలిపారు. మరోవైపు ఐరోపా నగరాలు టాప్ 30 ర్యాంకింగ్స్‌లో ఉన్నాయి. అయితే సియోల్, ఒసాకా, చెన్నైతో సహా ఆసియా గ్లోబల్ హబ్‌లు గణనీయమైన పురోగతిని సాధించాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!