గాజా ఇష్యూపై భారత్ తో ఒమన్ చర్చలు
- October 28, 2023
మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ హమద్ అల్ బుసైదీ ఈరోజు ఫోన్ కాల్ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, సమన్వయ సంబంధాలపై చర్చించారు. గాజా స్ట్రిప్, దాని పరిసరాలలో బాధాకరమైన మానవతా పరిస్థితులు, పరిణామాలపై కూడా ఇద్దరు మంత్రులు చర్చించారు. మానవతా అవసరాలను అందించాల్సిన ఆవశ్యకత, సంక్షోభం తీవ్రతను తగ్గించడం ప్రాముఖ్యతపై వారు అంగీకరించారు. అన్ని పార్టీలు హింస, ఉగ్రవాదాన్ని వీడాలని కోరారు. న్యాయమైన, సమగ్రమైన శాంతిని సాధించడానికి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లాలని వారు చెప్పారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ ఆక్రమణను ముగించాలని కోరారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







