గాజాపై అత్యవసర UN సమావేశానికి యూఏఈ పిలుపు

- October 29, 2023 , by Maagulf
గాజాపై అత్యవసర UN సమావేశానికి యూఏఈ పిలుపు

యూఏఈ: గాజాలో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను డిస్‌కనెక్ట్ చేయడంతో వీలైనంత త్వరగా సమావేశం కావాలని యూఏఈ శనివారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరిందని దౌత్యవేత్తలు తెలిపారు. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ ను ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా అత్యవసర UNSC సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యూఏఈ అభ్యర్థించిందని యూఏఈ దౌత్యవేత్తలు వెల్లడించారు.  15 మంది సభ్యుల కౌన్సిల్ ఆదివారం నాటికి సమావేశం కావచ్చని దౌత్యవేత్తలు తెలిపారు. మరోవైపు యూఏఈ ఆక్రమిత గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టడాన్ని ఖండించింది. ఇజ్రాయెల్ సైనిక దాడులు తీవ్రతరం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com