గాజాలో పౌరుల్ని రక్షించండి.. ఇజ్రాయెల్ ప్రధానికి బైడెన్ ఫోన్
- October 30, 2023
వాషింగ్టన్: హమాస్‌ను సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ గాజాపై విచక్షణారహితంగా విరుచుకు పడుతోంది. ఈ దాడుల్లో గాజాలోని సామాన్య పౌరులు పిట్టల్లా రాలిపోతున్నారు. ..ముఖ్యంగా చిన్నారులు, మహిళలు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచమంతా ఈ నరమేధాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నా.. ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా ఆ దేశానికి ఓ సూచన చేసింది.
ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని చెబుతూనే.. గాజాలో సామాన్య పౌరుల ప్రాణాలను రక్షించే అంతర్జాతీయ చట్టాలకు అణుగుణంగా ఇజ్రాయెల్ వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు. గాజాలో సామాన్య పౌరులను రక్షించాలని ఈ సందర్భంగా బైడెన్ కోరారు. ఓవైపు వైమానికి దాడులు.. మరోవైపు భూతల దాడులతో గాజాలో భీతావహ పరిస్థితులు ఎదురవుతున్నాయని.. సరైన తిండి, నీరు లేక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా గాజా పౌరులకు మానవతా సాయం అందేలా చూడాలని నెతన్యాహుకు బైడెన్ ఫోన్లో సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







