మాల్దీవ్స్ కు ఇండిగో విమాన సర్వీసులను పునఃప్రారంభిచనున్న హైదరాబాద్ విమానాశ్రయం
- October 31, 2023
హైదరాబాద్: సుందరమైన మాలదీవ్స్కు మీ హాలీడే ప్లాన్ చేయడానికి మీరు సరైన సమయాన్ని కోరుకుంటే, ఇక ఎదురు చూడకుండా మీ విమాన టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి! హైదరాబాద్- మాలదీవ్స్ను కలుపుతూ ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ప్రకటించింది. మంత్రముగ్ధులను చేసే అనుభవాలతో నిండిన మాలదీవ్స్ను తమ సెలవుల కోసం ఎంచుకున్న విహార యాత్రికుల నుండి పెరుగుతున్న డిమాండ్ ను పూర్తి చేసేందుకు సేవలను పునరుద్ధరించారు.
అక్టోబర్ 31 నుంచి ఇండిగో విమానం 6ఈ-1797 హైదరాబాద్ నుంచి 12:40 గంటలకు బయలుదేరి 14:50 గంటలకు మాలె విమానాశ్రయానికి చేరుకుంటుంది. మాలె నుంచి 15:55 గంటలకు బయలుదేరే విమానం 6ఈ-1798 హైదరాబాద్ విమానాశ్రయానికి 18:45 గంటలకు చేరుకుంటుంది. హైదరాబాద్, మాలే నుంచి నాన్ స్టాప్ ఫ్లైట్ ప్రతి మంగళ, గురు, శనివారాల్లో బయలుదేరుతుంది.
1192 ద్వీపాలను కలిగిన మాల్దీవ్స్ దేశం లో ఉన్న సముద్రపు దిబ్బలలో వెయ్యి జాతుల చేపలు నివసిస్తాయి . విలాసవంతమైన రిసాట్లు మరియు ప్రైవేట్ బీచ్లతో మాల్దీవ్స్ భారతీయులకు అన్ని కాలాల్లో ఇష్టమైన హాలిడే గమ్యస్థానాలలో ఒకటి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







