బాదం పప్పు ఎక్కువగా తినేస్తున్నారా.?

- October 31, 2023 , by Maagulf
బాదం పప్పు ఎక్కువగా తినేస్తున్నారా.?

బాదం పప్పు తింటే ఆరోగ్యానికి మంచిదే. అయితే, అతి సర్వత్రా వర్జయేత్ అంటారు కదా.. అలా బాదం పప్పు మంచిదే కదా.. అని ఎక్కువగా తీసుకుంటే చాలా చాలా కీడు కలుగుతుంది. అదేంటో తలుసుకుందాం.

బాదం పప్పు ప్రతీ రోజూ పరిమితమైన డోస్‌లో తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా బ్రెయిన్ షార్ప్ అవుతుంది. పిల్లలు క్రమం తప్పకుండా తింటే మెదడు చురుగ్గా పని చేసి జ్ఞాపక శక్తి మెరుగవుతుంది.

అలాగే ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలపై దీని ప్రభావం ఎక్కువగా వుంటుంది. కిడ్నీల్లో స్టోన్స్ రావడానికి కారణమవుతుంది. ఎక్కువగా తింటేనే సుమా.! బాదం పప్పులో ఆక్సలేట్ ఎక్కువగా వుంటుంది. ఇదే కిడ్నీలో స్టోన్స్ రావడానికి కారణం. కిడ్నీ సంబంధిత వ్యాధులున్న వాళ్లు బాదం పప్పుకు దూరంగా వుంటేనే మంచిది.

అలాగే బాదం పప్పులో విటమిన్ ఇ అధిక మొత్తంలో వుంటుంది. గర్భిణీ స్త్రీలు ఏమాత్రం బాదం పప్పును అధికంగా తీసుకున్నా అధిక రక్త స్రావం అయ్యే ప్రమాదం వుంటుంది. విటమిన్ ఇ సరైన మోతాదులో మాత్రమే గర్భిణీ స్త్రీలకు అందాల్సి వుంటుంది. ఎక్కువ డోస్‌లో అందితే, ప్రమాదానికి కారణమవుతుంది.

అలాగే, మితి మీరి బాదం పప్పు తినే వారికి శ్వాస కోశ సంబంధిత వ్యాధులు వేధిస్తాయ్. సో, బాదం పప్పును పరిమితికి మించి తినరాదు సుమా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com