షురా కౌన్సిల్‌లో 64 శాతం అభ్యర్థులు కొత్తవారే

- October 31, 2023 , by Maagulf
షురా కౌన్సిల్‌లో 64 శాతం అభ్యర్థులు కొత్తవారే

మస్కట్: షురా కౌన్సిల్ పదో ఎన్నికలలో ఎన్నికైన వారిలో 64 శాతం మంది కొత్త అభ్యర్థులు ఉన్నారు. కొత్త అభ్యర్థులకు ఓటర్లు ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం 843 మంది అభ్యర్థులు పోటీ పడగా.. 90 మంది సభ్యులుఎన్నికయ్యారు. ఇందులో 32 మంది మహిళలు ఉన్నారు.  సోమవారం హోటల్ ఇంటర్‌కాంటినెంటల్‌లో జరిగిన విస్తృతమైన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కొత్త షురా సుప్రీం కమిటీ ప్రెస్ మీట్ నిర్వహించింది. సుప్రీంకోర్టు డిప్యూటీ ప్రెసిడెంట్,  షురా కౌన్సిల్ ఎన్నికల సుప్రీం కమిటీ చైర్మన్ షేక్ అల్ ముఖ్తార్ బిన్ అబ్దుల్లా అల్ హార్తీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మాకు ఎటువంటి అప్పీళ్లు రాలేదన్నారు. అయితే, ఏదైనా పోలింగ్ అవకతవకలకు వ్యతిరేకంగా అప్పీళ్లను సమర్పించేందుకు మరో పది రోజుల సమయం ఉందన్నారు. అప్పీళ్లను సమర్పించిన 15 రోజులలోపు న్యాయమైన నిర్ణయాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.       

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com