‘డెవిల్’ ఊసేది కళ్యాణ్ రామా.!
- November 01, 2023
అభిషేక్ నామా దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘డెవిల్’. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే వచ్చిన ఈ సినిమా ప్రోమోస్‌ని యాక్షన్ కట్స్‌లో హై రిచ్‌గా రిలీజ్ చేశారు. దాంతో సినిమాపై ఓ మోస్తరుగా అంచనాలు క్రియేట్ అయ్యాయ్.
అయితే, ఈ సినిమా రిలీజ్ విషయంలో కాస్త గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. నవంబర్ 24న ‘డెవిల్’ ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, ఇంతవరకూ ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ జోరే కనిపించడం లేదు.
దాంతో, ఈ నెలలో ‘డెవిల్’ రిలీజ్ లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయ్. డిశంబర్ సినిమాల విషయంలోనూ ప్రమోషన్లు షురూ చేశారు ఆయా సినిమాల మేకర్లు. కానీ, ఈ నెలలోనే రిలీజ్ కావల్సిన ‘డెవిల్’ టీమ్ ఎందుకు సైలెంట్ అయిపోయారు.? జరుగుతున్న ప్రచారంపై నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎందుకు సైలెంట్‌గా వున్నాడు.? అనే అంశాలపై కళ్యాణ్ రామ్ అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది.
అసలే ఈ మధ్య కళ్యాణ్ రామ్ ఖాతాలో ఒక్క హిట్టు కూడా లేదు. ‘బింబిసార’ వంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత ‘అమిగోస్’తో చతికిలబడ్డాడు. సో, ‘డెవిల్’తో మళ్లీ పుంజుకుంటేనే ఫ్యాన్స్‌లో హుషారు నింపగలడు. ఏం చేస్తాడో.? చూడాలి మరి.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







