ప్రమోషన్లు షురూ చేసిన ‘హాయ్ నాన్న’.!
- November 01, 2023
నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘హాయ్ నాన్న’. డిశంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ లోగా సినిమా ప్రమోషన్లు షురూ చేశారు చిత్ర యూనిట్. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషన్ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయ్.
తండ్రీ కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందన్న హింట్ కూడా ఆల్రెడీ అందేసింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శృతి హాసన్ గెస్ట్ రోల్ పోషిస్తోంది ఈ సినిమాలో.
తాజాగా ‘అమ్మాడి..’ అంటూ సాగే లిరికల్ సాంగ్ శాంపిల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోకి సంబంధించి ఫుల్ లిరికల్ వీడియో ఈ నెల 4న రిలీజ్ కానుంది.
కాగా, నాని ఇటీవలే ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దూకుడు మీదున్నాడు. ‘దసరా’కి పూర్తి భిన్నమైన కాన్సెప్ట్‌తో ‘హాయ్ నాన్న’గా రాబోతున్నాడు.
ఈ సినిమా కోసం కంప్లీట్ మేకోవర్‌లో నాని కనిపిస్తున్నాడు. ‘అమ్మాడి..’ వీడియోలో మృణాల్ ఠాకూర్, నాని మధ్య క్యూట్ అండ్ జాయ్ ఫుల్ సన్నివేశాలు కట్ చేశారు. శాంపిల్ వీడియోలోనే ఇంత క్యూట్‌గా కనిపించింది ఈ జంట. ఇక, ఫుల్ సాంగ్ వీడియోలో ఇంకెలా వుండబోతోందో చూడాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.
Pinching your hearts on 4th :)#Ammadi will be magic ♥️#HiNannaOnDec7th pic.twitter.com/RrL1yTDwVT
— Nani (@NameisNani) November 1, 2023
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







