‘పొలిమేర 2’కి అంత క్రేజా.?

- November 01, 2023 , by Maagulf
‘పొలిమేర 2’కి అంత క్రేజా.?

ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చాకా కొన్ని సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. చిన్న సినిమాలే అయినా కంటెంట్ రిచ్ మూవీస్‌గా ప్రేక్షకుల నుంచి ప్రత్యేకమైన ఆదరణ దక్కించుకుంటున్నాయ్. కొన్ని సినిమాలకైతే, మెస్మరైజ్ స్ర్కీన్‌ప్లేతో ఆకట్టుకుంటున్నారు మేకర్లు.

అలాంటి కోవకు చెందిందే ‘పొలిమేర’ సినిమా. రెండు మూడు నెలల క్రితం ధియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో వుంది. ఓటీటీలో ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

అదలా వుంటే, ఈ సినిమాకి రెండు మూడు సీక్వెల్స్ రెడీగా వున్నాయనీ, ఆల్రెడీ రెండో సీక్వెల్ ‘పొలిమేర 2’కి ధియేటర్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.

నవంబర్ 3న ‘పొలిమేర 2’ గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. డిఫరెంట్ స్ర్కీన్‌ప్లే, క్యూరియాసిటీ థ్రిల్ కావాలనుకున్నవాళ్లు ఖచ్చితంగా ‘పొలిమేర 2’ సినిమాని చూసి సంతృప్తికరంగా ఫీలవ్వచ్చని యూనిట్ సినిమాని ప్రమోట్ చేస్తోంది.

కమెడియన్ సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకి అనిల్ విశ్వనాధ్ దర్శకత్వం వహించారు. కామాక్షి ఫిమేల్ లీడ్ రోల్ పోషించింది. ‘కాంతారా’, ‘విరూపాక్ష’ తరహాలో సూపర్ నేచురల్ పవర్స్, మూఢ నమ్మకాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com