డయాబెటిస్ వున్నవాళ్లు సీతాఫలం తీనకూడదా.?

- November 01, 2023 , by Maagulf
డయాబెటిస్ వున్నవాళ్లు సీతాఫలం తీనకూడదా.?

డయాబెటిస్ వున్నవాళ్లు ఆహారం విషయంలో కొన్ని ప్రణాళికబద్దమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు చక్కెర ఎక్కువగా వుండే ఆహార పదార్ధాలను తీసుకునే ముందు కాస్త జాగ్రత్త వహించాలి. ఆచి తూచి వ్యవహరించాలి. వైద్యుని సలహా తీసుకోవాలి.

పండ్లలో జామ పండు డయాబెటిస్ వాళ్లకు చాలా మంచి పండు. అయితే, కాస్త పచ్చిగా వున్నప్పుడే జామకాయను తింటే మంచిది. పండిన జామ పండులో చక్కెర శాతం ఎక్కువగా వుంటుంది. వాటిని అవైడ్ చేస్తే మంచిది.

అలాగే, సీజనల్ ఫ్రూట్‌గా చెప్పుకునే సీతాఫలం తింటే,  డయాబెటిస్ వున్న వాళ్లకు ప్రమాదమే అని చెబుతున్నారు. ఈ పండులో గ్జైనమిక్ ఇండెక్స్ 54గా వుంటుంది. కానీ, డయాబెటిస్ వున్న వాళ్లు ఇంత కన్నా తక్కువ గ్జైనమిక్ ఇండెక్స్ వున్న ఆహార పదార్ధాలనే తీసుకోవాల్సి వుంటుంది.

సో, సీతాఫలం డయాబెటిస్ వాళ్లకు అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. సీజనల్ ఫ్రూట్ కావట్టి.. చాలా తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఓకే. అది కూడా షుగర్ లెవల్స్ నార్మల్ స్థాయిలో వున్న వాళ్లకు మాత్రమే.

షుగర్ నియంత్రణలో లేని వాళ్లు సీతా ఫలం జోలికి పోరాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, సీతాఫలం మిగిలిన వాళ్లకు చాలా మంచిది. ఈ పండును తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ పండులో హెమోగ్లోబిన్ స్థాయి అధికంగా వుంటుంది. అలాగే కాల్షియం, మెగ్నీషింయం, విటమిన్ సి, ఇ అధికంగా వుంటాయ్. సో, డయాబెటిస్ లేని వాళ్లు ఈ పండును తినడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com