నవంబర్ 6, 13 తేదీల్లో యూఏఈ ఆకాశంలో అద్భుతం

- November 01, 2023 , by Maagulf
నవంబర్ 6, 13 తేదీల్లో యూఏఈ ఆకాశంలో అద్భుతం

యూఏఈ: నవంబర్ 6న, ఆపై నవంబర్ 13న యూఏఈ ఆకాశంలో రాత్రి సమయాల్లో అద్భుతం ఆవిషృతం కానుంది. "హాలోవీన్ ఫైర్‌బాల్" అని కూడా పిలువబడే టౌరిడ్స్ ఉల్కాపాతాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఉల్కాపాతం కామెట్ తోకలోని వివిధ భాగాల నుండి ఉత్తర, దక్షిణ టౌరిడ్స్ అనే రెండు సమూహాలతో కూడి ఉంటుందని NASA ఉల్కాపాతం నిపుణుడు బిల్ కుక్‌ వెల్లడించారు.  ఓరియోనిడ్స్ సాధారణంగా భూమికి దాదాపు 58 మైళ్ళు (93 కిమీ) ఎత్తులో మండుతాయని, అయితే టౌరిడ్స్ 42 మైళ్ళు (66 కిమీ) వరకు చేరుకోగలవని వివరించారు. వాటి వేగం సెకనుకు దాదాపు 17 మైళ్లు (27 కిలోమీటర్లు) లేదా గంటకు 65,000 మైళ్లు (104,000 కిమీ) వేగంతో ఆకాశంలో కదులుతుందన్నారు. అదే పెర్సీడ్స్ సెకనుకు 37 మైళ్లు (59 కిమీ) వేగంతో ఆకాశంలో కదులుతాయని పేర్కొన్నారు. ఉల్కాపాతం  సెప్టెంబరు చివరి నుండి డిసెంబర్ ప్రారంభం వరకు చురుకుగా ఉంటుందని, నవంబర్ మధ్యలో గరిష్టతకు చేరుకుంటుందని దుబాయ్ శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శరత్ రాజ్ వివరించారు. టారిడ్ ఉల్కాపాతం పురాతనమైనదని, ఇది ప్రతి 3.3 సంవత్సరాలకు సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com