రేసు నుండి తప్పుకున్న ఆస్ట్రేలియా.. సౌదీ అరేబియాకు లైన్ క్లియర్
- November 01, 2023
జెడ్డా: ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ సమాఖ్య బిడ్డింగ్ పోటీ నుండి వైదొలగడంతో సౌదీ అరేబియా పురుషుల 2034 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు మరింత పెరిగింది. బిడ్ సమర్పణల కోసం విధించిన గడువు మంగళవారం ముగిసింది. దీంతో సౌదీ అరేబియా ఏకైక బిడ్ వేసిన దేశంగా నిలిచింది. 2034 పోటీకి వేలం వేయకూడదనే దాని నిర్ణయానికి సంబంధించిన అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకున్నట్లు ఫుట్‌బాల్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. సౌదీ అరేబియా హోస్ట్‌గా FIFA అధికారిక ఆమోదం వచ్చే ఏడాది ప్రకటించనున్నారు. ఇండోనేషియా ప్రారంభంలో మలేషియా, సింగపూర్‌లతో పాటు ఆస్ట్రేలియాతో ఉమ్మడి బిడ్‌ను వేయాలని సిద్ధమైంది. అయితే చివరికి సౌదీ అరేబియాకు మద్దతుగా రేసులోంచి వైదొలిగింది. దీంతో ఆస్ట్రేలియా 2029 క్లబ్ ప్రపంచ కప్, 2026 మహిళల ఆసియా కప్ కోసం హోస్టింగ్ హక్కులను పొందడంపై ఫోకస్ పెట్టింది. మరోవైపు సౌదీ అరేబియా 2027లో పురుషుల ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
తాజా వార్తలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు







