కెసిసిఐ ఛైర్మన్‌తో భారత రాయబారి కీలక చర్చలు

- November 02, 2023 , by Maagulf
కెసిసిఐ ఛైర్మన్‌తో భారత రాయబారి కీలక చర్చలు

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (KCCI) ఛైర్మెన్ మొహమ్మద్ జాసిమ్ అల్-హమద్ అల్-సాగెర్ ని కలిశారు. ఇండియా-కువైట్ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని పెంపొందించే అవకాశాలను అన్వేషించే వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఎంబసీ వాణిజ్య కార్యక్రమాలకు మద్దతు ఇచ్చినందుకు KCCIకి రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల, కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం, NASSCOM, IBPC మరియు కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో కలిసి సమాచార సాంకేతిక రంగంలో ఇండియా- కువైట్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంచే లక్ష్యంతో కువైట్‌లో 'ఇండియా-కువైట్ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com