పైలట్లు, విమాన సిబ్బంది మౌత్‌వాష్‌ వాడొద్దు అంటూ DGCA రూల్

- November 02, 2023 , by Maagulf
పైలట్లు, విమాన సిబ్బంది మౌత్‌వాష్‌ వాడొద్దు అంటూ DGCA రూల్

న్యూ ఢిల్లీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బుధవారం (నవంబర్ 1,2023) విమానా కార్యకలాపాలకు భద్రతను పెంపొందించేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. పైలట్లు, విమానం సిబ్బంది ఇక నుంచి మౌత్ వాష్, టూత్ జెల్ లను వాడకూడదని ఆదేశించింది. పౌర విమానయాన అవసరాల నిబంధనల సవరణలో భాగంగా పైలట్లతో పాటు విమాన సిబ్బంది బ్రీత్ ఎనలైజర్ లలో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుందని..దీంతో వాటిని వాడితే బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయని కాబట్టి ఇకనుంచి అవి వాడొద్దు అని వెల్లడించింది.

వీటితో పాటు సివిల్ ఏవియేషన రిక్వైర్ మెంట్ లో మరికొన్ని నిబంధనల్ని కూడా మార్చింది. ఇక నుంచి ఏ సిబ్బందీ కూడా డ్రగ్స్, వాటికి సంబంధించిన అవశేషాలు కలిగి ఏండే ఎటువంటి పదార్ధాలను వినియోగించకూడదని పేర్కొంది. మౌత్ వాష్, టూత్ జెల్ లకు దూరంగా ఉండాలని సూచించింది.

ఒకవేళ ఎవరైనా వాడాలని అనుకుంటే డాక్టర్ల సూచనల మేరకు వాడాలని మరీ ముఖ్యంగా డ్యూటీల్లో వెళ్లే ముందు తాము పని చేసే సంస్థల డాక్టర్లు తప్పకుండా సంప్రదించాల్సి ఉంటుందని DCGA స్పష్టం చేస్తు ప్రకటించింది. సీజనల్ కార్యకలాపాలలో నిమగ్నమైన ఎయిర్ ఆపరేటర్లు,నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కెమెరా రికార్డింగ్‌ను DGCA తప్పనిసరి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com