బహ్రెయిన్ -ఇజ్రాయెల్ మధ్య తెగిన దౌత్య సంబంధాలు..!

- November 03, 2023 , by Maagulf
బహ్రెయిన్ -ఇజ్రాయెల్ మధ్య తెగిన దౌత్య సంబంధాలు..!

బహ్రెయిన్ : ఇజ్రాయెల్‌లోని గల్ఫ్ స్టేట్ రాయబారి స్వదేశానికి తిరిగి వచ్చారని,  మనామాలోని ఇజ్రాయెల్ రాయబారి రాజ్యాన్ని విడిచిపెట్టారని బహ్రెయిన్ గురువారం తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణ నేపథ్యంలో బహ్రెయిన్ పార్లమెంట్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. హమాస్‌తో జరిగిన యుద్ధంలో గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ బాంబుల దాడి చేయడం వల్ల వేలాది మంది ప్రజలు మరణించారని పేర్కొంది. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులను నిలిపివేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.  అదే సమయంలో బహ్రెయిన్ లోని ఇజ్రాయెల్ రాయబారి బహిష్కరించబడ్డారా లేదా అతనే వెళ్లిపోయాడా అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది.  మరోవైపు బహ్రెయిన్‌తో తమ సంబంధాలు "స్థిరమైనవి" అని, అటువంటి చర్యల గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఇజ్రాయెల్ చెప్పింది. అంతకుముందు బహ్రెయిన్ రాజ్యంలోని ఇజ్రాయెల్ రాయబారి బహ్రెయిన్‌ను విడిచిపెట్టినట్లు ప్రతినిధుల మండలి ధృవీకరించింది. అలాగే ఇజ్రాయెల్‌లో ని బహ్రెయిన్ రాయబారి తిరిగి రావాలని బహ్రెయిన్ పార్లమెంటు ఆదేశించింది.  గాజా ఆరోగ్య అధికారుల ప్రకారం.. 2.3 మిలియన్ల జనాభా కలిగిన చిన్న పాలస్తీనా ఎన్‌క్లేవ్‌పై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో 3,760 మంది పిల్లలతో సహా కనీసం 9,601 మంది మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com