సౌదీ అరేబియాలో 1,698 మంది అవయవ దాతలు
- November 03, 2023
రియాద్: సౌదీ అరేబియాలో 2022లో అవయవ దాతల సంఖ్య 1,698కి చేరుకుంది. వారిలో ఎక్కువ మంది కిడ్నీ దాతలున్నారని సౌదీ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (SCOT) వెల్లడించింది. 1,022 మంది జీవించి ఉన్న దాతలు, 138 మంది బ్రెయిన్ డెడ్ దాతలు దానం చేసిన అవయవాలతో నిరుపేద రోగులకు మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. 374 మంది జీవించి ఉన్న దాతలు, 66 మంది బ్రెయిన్ డెడ్ దాతల అవయవాలతో కాలేయ మార్పిడి చికిత్సలు నిర్వహించినట్లు SCOT పేర్కొంది. గుండె మార్పిడి కోసం 41 మంది బ్రెయిన్ డెడ్ దాతలు, ఊపిరితిత్తుల రోగుల ప్రాణాలను కాపాడేందుకు 38 మంది బ్రెయిన్ డెడ్ డోనర్లు ముందుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. SCOT యొక్క రికార్డుల ప్రకారం.. 41 మంది బ్రెయిన్ డెడ్ వ్యక్తుల విరాళాల ద్వారా ప్యాంక్రియాస్ మార్పిడి జరిగింది. ఐదుగురు బ్రెయిన్ డెడ్ వ్యక్తులు పేగులను దానం చేశారు. సౌదీ అరేబియాలోని మానవ అవయవ దాన చట్టం ప్రకారం.. ఇస్లామిక్ షరియా చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఒక వ్యక్తి తన అవయవాలలో ఏదైనా అవయవాన్ని దానం చేయడం కోసం సిఫార్సు చేయడానికి అనుమతి ఉంది.
తాజా వార్తలు
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..









